TN 24X7 - వార్తలు / : టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రతన్ టాటా మరణించిన విషయాన్ని హర్ష గొయెంకా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. రతన్ టాటా ఎంతో ఉదారమైన వ్యక్తి. 86ఏళ్ల రతన్ టాటా 28 డిసెంబర్ 1937న జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు.. శిక్షణ పూర్తయిన తర్వాత, రతన్ టాటా తన బాధ్యతలను నిర్వహించడం ప్రారంభించాడు. మొదట టాటా గ్రూప్‌లో అసిస్టెంట్‌గా చేరారు. రతన్ టాటా..1991 మార్చి నుండి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను నడిపించారు. 2008లో, రతన్ టాటాను భారత ప్రభుత్వం దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
Admin
TN 24X7