TN 24X7 - వార్తలు / : ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. వీటిల్లో ఒక బోటు విజయవంతంగా తొలగించారు. దాదాపు 40 టన్నుల బరువున్న భారీ బోటును ఒడ్డుకు బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో బెకెం ఇన్ఫ్రా ఇంజినీర్లు భారీ బోటును మంగళవారం (సెప్టెంబర్ 17) రాత్రి ఒడ్డుకు చేర్చారు. ఎనిమిది రోజులుగా గేట్ల దగ్గరే బోట్ల తొలగింపులో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ప్లాన్ బీ ఫ్లాప్ అయింది. ప్లాన్ సీ అప్లయ్ చేయలేకపోయారు. ఆఖరికి అబ్బులు టీమ్ కూడా చేతులెత్తేసింది. అప్పుడే సరికొత్త ప్రణాళికతో ఎంట్రీ ఇచ్చింది బెకెం ఇన్ఫ్రా సంస్థ. వాటర్ లోడింగ్ విధానంతో ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత పనుల్లో పురోగతి సాధించింది. ఒక బోటును విజయవంతంగా బయటకు తీసింది. మిగతా బోట్లను ఇవాళ వెలికితీస్తామంటున్నారు ఇంజినీర్లు. అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం అయింది. ఎనిమిది రోజుల అధికారుల శ్రమకు ఫలితం దక్కింది.
Admin
TN 24X7