TN 24X7 - వార్తలు / : ముంబై నటిపై వేధిపుల కేసు మరో మలుపు తిరిగింది. . ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి.. ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. ఆ సమయంలో విజయవాడలో పనిచేసిన ఏసీపీ హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలపై వేటుపడింది.. పోలీసు ఉన్నతాధికారులు ఇద్దర్ని సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావును బదిలీల్లో భాగంగా కాకినాడ డీఎస్పీగా పంపగా.. ముంబై నటిని పోలీసులు కస్టడీకి వచ్చిన సమయంలో మళ్లీ విజయవాడ ప్రత్యేకంగా వచ్చారు.ముంబై నటి ఇంటరాగేషన్‌లో ఏసీపీ హనుమంతరావు కీలక పాత్ర వహించారు.. అలాగే సీఐ సత్యనారాయణ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంని కేసు నమోదు చేసి అరెస్టు చేశారనే అభియోగాలు వచ్చాయి.వీరిద్దరితో పాటుగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులపైనా చర్యలకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. తన కుటుంబం ఏ తప్పూ చేయకపోయినా 42 రోజులపాటు నరకం అనుభవించిందన్నారు. దీనికి కారణమైన ఐపీఎస్‌లతో పాటు, వైఎస్సార్‌సీపీ నేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముంబై నటి ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకుని.. కేసు నమోదు చేస్తామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. నిబంధనల ప్రకారం తాము ఇబ్రహీపట్నం సీఐకు ఫిర్యాదు చేశామని.
Admin
TN 24X7