TN 24X7 - ఎంటర్టైన్మెంట్ / : యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈసినిమాలో బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా సముద్రంలో షార్క్పై ఎన్టీఆర్ సవారీ షాట్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేద్ధామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా దేవర చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు తారక్. మొన్నటి వరకు ముంబైలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నార్త్ అడియన్స్కు దగ్గరయ్యారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రావాలని మహేష్ బాబును డైరెక్టర్ కొరటాల శివ ఆహ్వానించారనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయం గురించి ఇప్పటికే కొరటాల శివ, మహేష్ మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దేవర ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ వస్తే మరింత హైప్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్, మహేష్ ఒకే స్టేజ్ పై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరీ చూడాలి దేవర వేడుకకు మహేష్ వస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. దేవర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Admin
TN 24X7