TN 24X7 - వార్తలు / : తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందా అంటే వాతావరణ శాఖ అవుననే అంటోంది. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం కారణంగా గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే, ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Admin
TN 24X7