TN 24X7 - వార్తలు / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ ప్రక్రియ ముగిశాక వెంటనే డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Admin
TN 24X7