TN 24X7 - హెల్త్ / : భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు పేర్కొంది. మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో అలజడి రేపిన మంకీపాక్స్ భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు పేర్కొంది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. Mpox (మంకీపాక్స్) పాజిటివ్‌గా నిర్ధారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉనికిని నిర్ధారించిందని తెలిపింది. సోకిన వ్యక్తి , Mpox తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవల ప్రయాణించిన ఒక యువకుడని పేర్కొంది.. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ సదుపాయంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
Admin
TN 24X7