TN 24X7 - వార్తలు / : వరద బాధితులకు సహాయం చేయడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతా ఇంత కాదు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాలయతీలకు ఒక్కో దానికి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల సొంత నిధులను విరాళంగా ప్రకటించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని పవన్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు (శనివారం) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటిని ఉపముఖ్యమంత్రి అందజేశారు. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును చంద్రబాబుకు పవన్ అందజేశారు.
Admin
TN 24X7