TN 24X7 - ఆధ్యాత్మికం / : నేటి నుంచి ఖైరతాబాద్ మహా గణపయ్యకి పూజలు ప్రారంభం. ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ కొలువుదీరాడు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఈ నెల 17 వ తేదీన ఘనంగా నిమజ్జన వేడుక జరుగనుంది. ఉదయం 11 గంటలకు వినాయకుడికి తొలి పూజ జరుగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేయనున్నారు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేష్ ప్రతిను రూపొందించే పనులు ఆలస్యంగా ప్రారంభమయినా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి.
Admin
TN 24X7