TN 24X7 - వార్తలు / : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. జోగి రమేష్ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్, అతని అనుచరుల కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం గాలిస్తున్నారు పోలీసులు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మంత్రి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి చంద్రబాబు నివాసంపై దాడి చేసేందుకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారున పోలీసులు. తాజాగా ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు జోగి రమేష్‌ను, ఆయన అనుచరులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్, అమీర్‌పేట్‌లోని ఆయన నివాసాల్లో గాలిస్తున్నారు. దీంతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ జోగి రమేష్ కోసం గాలింపు చేపట్టారు ఏపీ పోలీసులు.
Admin
TN 24X7