TN 24X7 - వార్తలు / : వైరల్ జ్వరంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , కుటుంబ సభ్యులు ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు డిప్యూటీ సీఎం తెలుసుకుంటున్నారు. సూపర్ క్లోరినేషన్ చేపట్టేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.
Admin
TN 24X7