TN 24X7 - వార్తలు / : వరద బాధితులను ఆదుకోవడానికి సినీ రంగం ముందుకు వచ్చింది. స్టార్ హీరోలు, నిర్మాతలు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాలను అందిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక వరద బాధితులను ఆదుకోవడానికి సినీ రంగం ముందుకు వచ్చింది. స్టార్ హీరోలు, నిర్మాతలు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాలను అందిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరదబాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు, మంచి నీళ్లు ఏర్పాటు చేశారు ప్రభాస్. ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Admin
TN 24X7