TN 24X7 - వార్తలు / : బాధితులను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. సినీ ప్రముఖులు పెద్దెత్తున విరాళాలు అందిస్తున్నారు. ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు అశ్విని దత్త (రూ. 25 లక్షలు), ఎన్టీఆర్( తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 1కోటి), విశ్వక్ సేన్( రూ. 10లక్షలు), సిద్ధూ జొన్నలగడ్డ(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.30లక్షలు), సూపర్ స్టార్ మహేష్ బాబు( రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి ), బాలకృష్ణ (రూ. 1 కోటి), పవన్ కళ్యాణ్ ( రూ.1కోటి ), నటి అనన్య నాగళ్ళ ( రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.5లక్షలు)ఇలా సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆంద్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయక నిధి చెరో రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు మెగాస్టార్. ఇక తెలుగు రాష్ట్రలో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన నష్టంతనకు కలిచివేసిందని అన్నారు చిరు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను అని అన్నారు చిరు. అలాగే పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో ప్రభుత్వంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి.
Admin
TN 24X7