TN 24X7 - క్రైమ్ / : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గంటల తరబడి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. నక్సలైట్లకు చెందిన పీఎల్ జీఏ కంపెనీ నంబర్ 2తో సైనికులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 10 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చారు. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలతోపాటు ఎస్‌ఎల్‌ఆర్, 303, 12 బోర్ ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా దళాలు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక చనిపోయిన మావోయిస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
TN 24X7