TN 24X7 - వార్తలు / : ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజి చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చి చేరింది. 2009 అక్టోబర్‌లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. 1903 వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుకుంది. బ్యారేజి మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజి దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగి పోయాయి. బ్యారేజిపై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంది.
Admin
TN 24X7