TN 24X7 - వార్తలు / : ఏపీకి మరో తుఫాన్ ముప్పు! వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఏపీకి మరో ముప్పు రానుంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Admin
TN 24X7