TN 24X7 - వార్తలు / : గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. నంబూరులోని ఓ స్కూల్ లో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భారీ వర్షాలతో శనివారం స్కూల్ కు సెలవు ప్రకటించారు. దీంతో ఆ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకొని రాఘవేంద్ర ఇంటికి బయల్దేరారు. ఉప్పలపాడు సమీపంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో ఆగకుండా కారు డ్రైవ్ చేయడంతో....వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు కారులోని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్థానికులు కారును వాగులోంచి లాగి, మృతదేహాలను బయటకు తీశారు.
Admin
TN 24X7