TN 24X7 - వార్తలు / : యాదగిరిగుట్ట(యాదాద్రి) శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు సమర్పించాలన్నారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులను అర్ధాంతరంగా ఆపవద్దని స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
Admin
TN 24X7