TN 24X7 - వార్తలు / : ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్ర, శనివారాల్లో పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు చేరువలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాకు భారీ వర్షాలు ఉంటాయంటోంది.
Admin
TN 24X7