TN 24X7 - వార్తలు / : పిఠాపురంలో ఆగస్టు 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆడపడుచుల కోసం ప్రత్యేకంగా సారె పంపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆలయ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయమని ఈవో శ్రీమతి భవానీ, ఆలయ అధికారులకు.. ఎమ్మెల్సీ సూచించారు. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులు అందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందజేయమని.. స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో వాటిని సమకూర్చారు. మొత్తం 12 వేల చీరలు పంపించారు. ఆలయం వద్ద వ్రతం అనంతరం పసుపు, కుంకుమ, చీర పంపిణీ చేయనున్నారు.
Admin
TN 24X7